ఆది పినిశెట్టి తో కీర్తి సురేష్ సినిమా

ఆది పినిశెట్టి తో కీర్తి సురేష్ సినిమా

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న నటులకు కొదవలేదు.  మంచి కథ దొరికితే టాలెంట్ బయటపడుతుంది.  టాలెంట్ ఉన్న హీరోల్లో ఆది పినిశెట్టి ఒకరు.  హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం వస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించే వ్యక్తి ఆది.  ఆది పినిశెట్టి హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కబోతున్నది. 

మహానటి తరువాత కీర్తి సురేష్ తెలుగులో మరో సినిమాకు సైన్ చేయలేదు.  చాలా కాలం తరువాత ఆది పినిశెట్టి సినిమాలో నటించేందుకు ఒకే చెప్పింది.  ఇందులో జగపతిబాబు కీలక పాత్ర చేస్తున్నారు.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.