మరో మల్టీస్టారర్ లో మహానటి

మరో మల్టీస్టారర్ లో మహానటి
కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మహానటి విడుదలయ్యి వారం గడుస్తున్నా వసూళ్లు నిలకడగా ఉన్నాయి.  నాపేరు సూర్య పరాజయం పాలవ్వడంతో మహానటికి కలిసి వచ్చింది.  తెలుగులో మొదటి బయోపిక్ కావడంతోపాటు భారీ తారాగణం ఉండటం ఈ సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు.  ఇక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది.  కీర్తి సురేష్ నటనకు రాజమౌళి సైతం మంచి మార్కులు వేశారు.  కీర్తి సురేష్ నటనలో మహానటిని తలపించిందని.. తాను చూసిన బెస్ట్ పెర్ఫార్మన్స్ లో కీర్తి సురేష్ నటన ఒకటని కితాబిచ్చారు.  
మహానటి తరువాత కీర్తి సురేష్ కు ఆఫర్లు ఒకదాని తరువాత ఒకటి వస్తున్నాయి.  అయితే, తాజా సమాచారం ప్రకారం రాజమౌళి తీస్తున్న మల్టి స్టారర్ సినిమాలో కీర్తి సురేష్ కు అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది.  రామ్ చరణ్ - ఎన్టీఆర్ లతో రాజమౌళి భారీ మల్టీస్టారర్ ను రూపొందిస్తున్నారు.  త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది.