కీర్తి కూడా అక్కడికే వెళ్తుంది..!!

కీర్తి కూడా అక్కడికే వెళ్తుంది..!!

మహానటికి ముందు కీర్తి సురేష్ గురించి పెద్దగా తెలియదు.  మహానటి సినిమాలో ఎప్పుడైతే మెయిన్ లీడ్ రోల్ చేసిందో అప్పటి నుంచే ఆమెకు గుర్తింపు రావడం మొదలుపెట్టింది.  మహానటి తరువాత తన సొంత పరిశ్రమ మలయాళంలో మరక్కార్ సినిమాలో నటిస్తోంది.  చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమా తెరెక్కుతోంది.  దీంతో పాటు తమిళంలోనూ రెండు సినిమాలు చేతులో ఉన్నాయి.  టాలీవుడ్ లో ఓ సినిమాకు రీసెంట్ గా సైన్ చేసింది.  

ఇలా సౌత్ ఇండియన్ సినిమాల్లో బిజీగా ఉంటూనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టేందుకు కూడా సిద్ధం అయింది.  గతేడాది వచ్చిన బదాయి హొ సినిమా రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.  ఈ సినిమా తరువాత దర్శకుడు ఓ సినిమాను చేయబోకున్నాడు.  ఇందులో హీరోయిన్ గా కీర్తికి అవకాశం వచ్చిందట.  ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ విలన్ గా చేస్తున్నాడు.  దీంతో సినిమాకు క్రేజ్ పెరిగింది.  ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కీర్తి సురేష్ బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిందట.