కేరళలో ఓనం తరహా క్రిస్మస్ వేడుకలు

కేరళలో ఓనం తరహా క్రిస్మస్ వేడుకలు

దేవుడి సొంత రాజ్యం కేరళలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కేరళ ప్రత్యేకమైన ఓనం తరహాలో సంప్రదాయ వస్త్రాలు ధరించిన మహిళలు తలపై శాంటాక్లాజ్ టోపీలు పెట్టుకొని రోడ్లపై నృత్యాలు చేశారు. రోడ్డుకి ఇరువైపులా నిలబడిన ప్రేక్షకులు కేరింతలతో వారిని ఉత్సాహపరిచారు. కేరళ మరోసారి తనదైన శైలిలో రోడ్ షోలు జరిపి పండుగలకు ప్రత్యేక శోభ తెచ్చిందని ఓ ఔత్సాహికుడు ఆ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.