కేరళలో కాంగ్రెస్, సీపీఎంకు చెరో రెండు...బీజేపీకి పెరిగిన ఓట్లు..  

కేరళలో కాంగ్రెస్, సీపీఎంకు చెరో రెండు...బీజేపీకి పెరిగిన ఓట్లు..  

కేరళ రాష్ట్రంలో ఐదు నియోజక వర్గాలకు ఈనెల 21 వ తేదీన ఉపఎన్నికలు జరిగాయి.  ఈ ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న సీపీఎం రెండు, కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల విజయం సాధించగా.. ముస్లిం లీగ్ పార్టీ ఒకచోట విజయం సాధించింది.  అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా పుంజుకుంది.  భారీ ఓటుబ్యాంకు సొంతం చేసుకుంది.  23.1శాతం ఓటింగ్ ను ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ సొంతం చేసుకుంది.  కాంగ్రెస్, సీపీఎంలకు ఇది అతి దగ్గరి ఓటింగ్ శాతం. అయితే ఒక్క స్థానంలోనూ గెలవలేదు. మంజేశ్వర్‌లో రెండో స్థానంలో నిలవగా మిగతా చోట్ల మూడో స్థానంలో ఉనికిని చాటుకుంది.  

మంజేశ్వర్, ఎర్నాకులం, ఆర్నూర్, కొన్ని, వట్టి యార్కప్ నియోజక వర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి.  ఈ ఉప ఎన్నికల్లో మజేశ్వర్ లో ముస్లిం లీగ్ పార్టీ విజయం సాధించగా, ఎర్నాకులం, ఆర్నూర్ నియోజక వర్గాల్లో సీపీఎం, కొన్ని, వట్టి యార్కప్ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.