కేరళలో మారుతి.. శైలజా రెడ్డి వాయిదా..?

కేరళలో మారుతి.. శైలజా రెడ్డి వాయిదా..?

శైలజా రెడ్డి అల్లుడు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నది.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా..రీ రికార్డింగ్ వర్క్ ఇంకా పూర్తికాలేదు.  గోపి సుందర్ ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు.  దర్శకుడు మారుతి రీ రికార్డింగ్ వర్క్స్ ను దగ్గర ఉండి చూసుకోవడానికి కేరళ వెళ్ళాడు.  అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో.. మారుతి అక్కడే ఉండిపోయాడట.  దీంతో సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అనుకున్న సమయం కంటే ఆలస్యంగా లేదంటే క్యాన్సిల్ చేసుకోవాలని యూనిట్ అనుకుంటున్నట్టు సమాచారం.  దీంతో పాటు సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది.  ఏదైనా కారణం చేత సినిమా ఆగష్టు 31 న రాలేని పక్షంలో సెప్టెంబర్ 4 న విడుదల చేసేందుకు యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నది. శైలజా రెడ్డి అల్లుడు అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నా.. ఏదొక కారణం చేత ఇలాంటి అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి.