కేరళ బాధితులకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు విరాళం

కేరళ బాధితులకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు విరాళం

భారీ వరదలు, వర్షాలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. తాజాగా ప్రయివేటు రంగ బ్యాంక్ దిగ్గజం.. హెచ్‌డీఎఫ్‌సీ కేరళను ఆదుకునేందుకు ముందుకొచ్చింది.  పదికోట్ల రూపాయల విరాళంతో పాటు, వరదలకు గురైన 30 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు తెలిపింది. ఆగస్టు మాసానికి సంబంధించి  పలు లోన్ లపై  చెల్లించాల్సిన నెలవారీ వాయిదాలు,  క్రెడిట్ కార్డు బిల్లు  చెల్లింపులపై  లేటు ఫీజును కూడా మాఫీ చేస్తున్నట్టు తెలిపింది.  ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని డొనేట్‌  చేసినట్టు ప్రకటించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేం కేరళకు అండగా ఉంటామని, గ్రామాల్లో వైద్యకేంద్రాలు, స్కూళ్లు పునర్‌నిర్మాణం జరుపుతున్నట్లు  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆదిత్య పూరి తెలిపారు.