క‌రోనా కేసుల్లో కేర‌ళ కొత్త రికార్డు

క‌రోనా కేసుల్లో కేర‌ళ కొత్త రికార్డు

క‌రోనా పాజిటివ్ కేసుల్లో కేర‌ళ కొత్త రికార్డు సృష్టించింది.. కేర‌ళ సీఎంవో తాజాగా ప్ర‌క‌టించిన ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా 722 కొత్త కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో.. కేర‌ళ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 10,275కు చేరింది.. ఇక‌, ఇవాళ మ‌రో ఇద్ద‌రు క‌రోనా రోగులు మృతిచెందారు.. ఇవాళ న‌మోదైన కేసుల్లో తిరువనంతపురంలో అత్యధికంగా 339 కేసులు బ‌య‌ట‌ప‌డ‌గా.., ఎర్నాకుళంలో 57, కొల్లంలో 42, మలప్పురంలో 42, పతనమిట్టలో 39, కోజికోడ్‌లో 33, త్రిస్సూర్‌లో 32, ఇడుక్కిలో 26, అలప్పుజలో 20, పాలక్కాడ్‌లో 25, కన్నూర్‌లో 23, కాసరాగోడ్‌లో 13, వయనామడ్‌లో 13 కేసులు న‌మోదు అయిన‌ట్టు ప్ర‌క‌టించారు. ధృవీకరించబడిన కేసుల్లో 157 విదేశాల నుండి వ‌చ్చిన‌వారు కాగా.. 67 మంది ఇతర రాష్ట్రాల నుండి వ‌చ్చిన‌వారు ఉన్నారు. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌తో మొత్తం దేశానికే ఆద‌ర్శంగా నిలిచిన కేర‌ళ‌లో ఇంత పెద్ద‌ల సంఖ్‌య‌లో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి.