వయసు 28...లాటరీ రూ.39 కోట్లు...
ఒక్కోసారి అదృష్టం ఎలా కలిసి వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొంతమంది ఎంతమంది ప్రయత్నించినా సరైన సంపాదన ఉండదు. జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు. కానీ, కొందరికి మాత్రం అనుకోకుండానే అలా కలిసి వస్తుంది. ఈజీగా డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే, ఇంకొందరికి మాత్రం లాటరీ రూపంలో డబ్బు కలిసి వస్తుంది. కేరళకు చెందిన అద్బుల్ సలామ్ ఎన్వీ అనే 28 ఏళ్ల వ్యక్తి మస్కట్ లో ఓ షాప్ ను రన్ చేస్తున్నాడు. ఇటీవలే అయన రఫల్ టికెట్ ను కొనుగోలు చేశారు. ఈ ఏడాది తొలి రఫల్ డ్రాను తీశారు. ఈ డ్రాలో 20 మిలియన్ దిన్హార్ లను గెలుచుకున్నాడు. ఈ విషయం తన స్నేహితుల ద్వారా ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు వచ్చిన మొత్తాన్ని తన స్నేహితులతో కలిసి పంచుకుంటానని అన్నారు. గతంలో ఇదే లాటరీ ద్వారా దిలీప్ కుమార్ అనే వ్యక్తి రూ.20 కోట్లు గెలుచుకున్నాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)