కీలక కమిటీలో కేశినేని, మాగుంట

కీలక కమిటీలో కేశినేని, మాగుంట

తెలుగుదేశం పార్టీ లోక్‌సభ ఎంపీ కేశినేని నాని, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి పార్లమెంటరీ అంచనాల కమిటీలో చోటు దక్కింది. 29 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ 30న ముగియనుంది. వార్షిక బడ్జెట్ అంచనాలను పరిశీలించి, వ్యయంలో పొదుపు చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఈ కమిటీ పలు సూచనలు చేస్తుంది. నివేదికలు అందజేస్తుంది.