జగన్ వలన రాష్ట్రానికే అప్రదిష్ట - నాని

జగన్ వలన రాష్ట్రానికే అప్రదిష్ట - నాని

టీడీపీ నేత, బెజవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం హోదాకు సకరించామని అడిగితే కేసీఆర్ చేయలేదు.  ఇప్పుడేమో జగన్ గెలుపుకు పనిచేస్తున్నారు.  రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.  దొంగలు, కుంభకోణాలు చేసిన వ్యక్తులు ప్రతిపక్షం నుంచి పోటీ చేస్తున్నారంటూ '97 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు, 12 మంది ఎంపీ అభ్యర్ధులపై కేసులున్నాయి.  గత ఎన్నికల్లో ఆలోచనతో వేసిన ఓటు అభివృద్ధికి కారణమైంది.  మళ్లీ అదే విజ్ఞతతో ఓటేయాల్సిన అవసరం ఉంది.  లక్షలాది మంది షేర్ హోల్డర్లను మోసం చేశారంటూ పీవీపీ వ్యాపార కార్యకలాపాలను సెబీ నిలిపేసింది.  వ్యాపారం చేయడానికి పనికి రారని పీవీపీని అమెరికన్ బ్యాంకులే తప్పు పట్టాయి.  వైసీపీ అధినేత మీదే 31 కేసులున్నాయి.  జగన్, పీవీపీ వంటి వారు రాష్ట్రానికే అప్రతిష్ట' అంటూ విమర్శలు గుప్పించారు.