కేశినేని నాని ట్వీట్లు.. లోకేష్ దాకా వెళ్లాయి

కేశినేని నాని ట్వీట్లు.. లోకేష్ దాకా వెళ్లాయి

విజయవాడ ఎంపీ కేశినేని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.  వాటిలో కొన్ని ప్రతిపక్షానికి తగులుతుంటే ఇంకొన్ని మాత్రం టీడీపీని తాకుతున్నాయి.  నాని సైతం కొన్ని ట్వీట్లలో కావాలనే సొంత పార్టీకి చురకలంటించారు.  తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ నేరుగా లోకేష్ నారాను తాకడం సంచలనమైంది. 

ఈరోజు ఉదయం నాని ట్విట్టర్లో 'నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు, ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం' అంటూ ట్వీట్ పెట్టారు. దాన్ని చూసిన నెటిజన్లు ఇది ఖచ్చితంగా లోకేష్ గురించే అయ్యుంటుందని బలంగా వాదిస్తున్నారు.  ఇంత వాదన జరుగుతున్నా కేశినేని ఈ తన ట్వీట్ పై క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం.