ఏపీ భవనాల అప్పగింతపై కీలక నిర్ణయం

ఏపీ భవనాల అప్పగింతపై కీలక నిర్ణయం

హైదరాబాద్‌లో ఉన్న ఏపీకి సంబంధించిన భవనాల అప్పగింతపై తెలంగాణ సీఎస్‌తో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఇవాళ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ తరఫున రామకృష్ణారావు ఈ సమావేశానికి హాజరై ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడంపై చర్చించారు. వారం రోజుల్లోగా భవనాల అప్పగింత పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చారు. అప్పగింత పూర్తయిన వెంటనే ఏపీ భవనాల్లోకి తెలంగాణ సచివాలయాన్ని తాత్కాలికంగా తరలించనున్నారు. ఏపీకి చెందిన సచివాలయ భవనాలను తెలంగాణ జీఏడీకి, అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి, ఎమ్మెల్యేల క్వార్టర్లను ఎస్టేట్ ఆఫీసర్‌కు అప్పగించాలని ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీలోగా కొత్త సచివాలయ భవనానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయబోతున్నారు.