తొలి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు..

తొలి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన సమావేశంలో ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సామాజిక పెన్షన్లు రూ.2,250కి పెంచుతూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక, ఆశా వర్కర్ల జీతాలు రూ. 3000 నుంచి రూ.10,000కు పెంచడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ చెల్లింపుకు పచ్చజెండా ఊపిన ఏపీ కేబినెట్... మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు క్యాబినెట్ సుముఖత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏపీ కేబినెట్ తొలి సమావేశం కొనసాగుతుండగా.. వైఎస్ఆర్ రైతు భరోసా అమలుపై చర్చిస్తున్నారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.