AIS సర్వీస్ రూల్స్ : ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

AIS సర్వీస్ రూల్స్ :  ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ మేరకు AIS సర్వీస్ రూల్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.  ఇకపై ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్ఎస్‌ల పని తీరు,  వారి ఫర్‌ఫామెన్స్‌ రిపోర్టులను స్వయంగా సీఎం ఆమోదించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్. సీఎస్, డీజీపీలు సహా ప్రతి ఏఐఎస్ అధికారి పనితీరు రిపోర్టులను సీఎం  ఆమోదిస్తారంటూ ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ సెక్రటరీగా వ్యవహరించే ఐఏఎస్‌కు ఫర్‌ఫామెన్స్‌ రిపోర్టు ఇవ్వనున్నారు గవర్నర్. ఇకపై సీఎం ఇచ్చే నివేదిక ఆధారంగానే కేంద్ర సర్వీసులకు వెళ్లే అవకాశం ఉండనుంది. AIS అధికారుల పదోన్నతులు, కీలక పోస్టింగుల విషయంలోనూ సీఎం నివేదికనే ఆధారం కానుంది.