డేటా చోరీపై కేబినెట్‌లో కీలక చర్చ!

డేటా చోరీపై కేబినెట్‌లో కీలక చర్చ!

హైదరాబాద్‌లో డేటా చోరీపై కేబినెట్‌లో కీలక చర్చ సాగింది... ఏపీ ప్రభుత్వంపై కేసులు పెడతామనడం, ఏపీ పోలీసులను అరెస్ట్ చేస్తామనడంపై కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ మినహా పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కేరళతో ఏ ఇబ్బందులు లేవన్న మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రతీ ఊరిలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పారదర్శకంగా వెల్లడిస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ డేటా దొంగిలించి ప్రత్యర్ధులకు అప్పగించి, అది బయటపడేసరికి దానిని కప్పిపుచ్చుకునేందుకే ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారన్న ఓ మంత్రి ఆరోపించగా... దారిన పోయే దానయ్య ఫిర్యాదులపై ఒక రాష్ట్ర పోలీసులపై ఇంకో రాష్ట్ర పోలీసులు కేసులు పెడతారా? అని ప్రస్తావించారు మంత్రి సోమిరెడ్డి. డేటా చోరీ కేసుల వ్యవహరంపై దేశం అంతా దీనిపై చర్చ జరగాల్సి ఉందన్నారు సీఎం చంద్రబాబు... సజ్జనార్ కామెంట్లపై ఓ మంత్రి కేబినెట్‌లో ప్రస్తావించగా... హైకోర్టు చీవాట్లు పెట్టేసరికి ఫ్రస్ట్రేషన్‌తో సజ్జనార్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ తీరును తేలిగ్గా వదలొద్దన్న భావనను మంత్రులు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సీనియర్ మంత్రులు, నేతలతో సమావేశమై యాక్షన్ ప్లాన్ రూపొందిద్దామన్న చంద్రబాబు తెలిపారు.