ఐదో విడతలో బరిలోఉన్న కీలక నేతలు వీరే..

ఐదో విడతలో బరిలోఉన్న కీలక నేతలు వీరే..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ 7 రాష్ట్రాల పరిధిలోని 51 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఐదోవిడతలో దేశవ్యాప్తంగా 674 మంది అభ్యర్థులు బరిలోగా ఉన్నారు. బీహార్‌లో ఐదు, జమ్మూకశ్మీర్‌లో రెండు, జార్ఖండ్‌లో నాలుగు, మధ్యప్రదేశ్‌లో ఏడు, రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌ లో 14, పశ్చిమ బెంగాల్‌ లోని 7 లోకసభ స్థానాలలో పోలింగ్ జరుగుతోంది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌, జయంత్‌ సిన్హా, నిరంజన్‌ జ్యోతితో పాటు యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితర ప్రముఖులు ఐదో విడతలో బరిలో ఉన్నారు. 

రాయ్‌బరేలీ లోకసభ స్థానం నుంచి సోనియా గాంధీ పోటీచేస్తోండగా, అమేథీ నుంచి రాహుల్‌ గాంధీ, ప్రత్యర్థిగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పోటీపడుతున్నారు. లక్నో లోక‌సభ స్థానానికి కేంద్రమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ పోటీపడుతుండగా, ఎస్పీ నుంచి పూనమ్‌ సిన్హా పోటీ చేస్తున్నారు. జైపూర్‌ రూరల్‌ లోక్‌ సభకు కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ పోటీ చేస్తోండగా, కాంగ్రెస్‌ నుంచి ప్రముఖ క్రీడాకారిణి కృష్ణ పునియా బరిలోకి దిగారు. 
* జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ లోక‌సభ స్థానంతోపాటు, లడఖ్‌ లోక‌సభకు జరగనున్న ఎన్నికల బరిలో 22 మంది అభ్యర్థులు ఉన్నారు.
* యూపీలో 14 లోక్‌సభ స్థానాల్లో 182 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 
* మధ్యప్రదేశ్‌ లో 7 లోక్‌ సభ స్థానాల్లో 110 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
* రాజస్థాన్‌లో 12 లోక్‌ సభ స్థానాల్లో 134 మంది అభ్యర్థులు పోటీ. ఇందులో 16 మంది మహిళా అభ్యర్థులున్నారు. 
* పశ్చిమ బెంగాల్‌లో ఏడు లోక్‌సభ స్థానాల్లో 83 మంది అభ్యర్థులు పోటీ.
* బీహార్‌లో ఐదు లోక్‌సభ స్థానాల్లో 82 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.