'కొచ్చర్‌ డీల్‌'పై కీలక భేటీ రేపు

'కొచ్చర్‌ డీల్‌'పై కీలక భేటీ రేపు

సోమవారం బ్యాంక్‌ పనితీరును పరిగణనలోకి తీసుకున్న ఐసీఐఐసీ బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డు రేపు మళ్ళీ భేటీ కానుంది. కేవలం బ్యాంక్‌ పనితీరును మాత్రమే సోమవారం సమీక్షించి, ఫలితాలకు ఆమోదం తెలిపినట్లు బ్యాంక్‌ తెలిపింది. అయితే బ్యాంక్‌ సీఈఓ చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ తో ముడిపడి వీడియోకాన్‌ డీల్‌పై మంగళవారం బ్యాంక్‌ బోర్డు చర్చిస్తుంది. చందా కొచ్చర్‌కు బ్యాంక్‌ బోర్డు క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో ఇవాళ్టి బోర్డు సమావేశానికి ప్రభుత్వ నామిని లోక్‌ రంజన్‌ హాజరు కాలేదు. ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకున్న వీడయోకాన్‌ కంపెనీ ... దీపక్‌ కొచ్చర్‌కు ఆర్థికంగా లబ్ది చేకూర్చిందని.. ఇది క్విడ్‌ ప్రొ క్రొ అంటూ మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో బ్యాంక్‌ మంగళవారం భేటీ కానుంది. చందా కొచ్చర్‌ను కొనసాగిస్తారా లేదా ఇది వరకు ఇచ్చిన క్లీన్‌ చిట్‌ను పునరుద్ఘాటిస్తారా అన్నది చూడాలి.