కీలక శాఖలు సీఎం కేసీఆర్ వద్దే..

కీలక శాఖలు సీఎం కేసీఆర్ వద్దే..

ఉదయం తెలంగాణ మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా... కాసేపటి క్రితమే మంత్రులకు శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... అయితే కీలకమైనశాఖలు మాత్రం ఎవరికీ కేటాయించలేదు. ఆర్థికశాఖ, రెవెన్యూశాఖ, ఐటీ శాఖ, నీటిపారుదల శాఖ, పట్టణాభివృద్ధిశాఖలను ఎవరికీ కేటాయించకుండా తన దగ్గరే ఉంచుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. కాగా, ఈటల రాజేందర్‌కు వైద్య ఆరోగ్యశాఖ, వేముల ప్రశాంత్‌ రెడ్డికి రోడ్లు భవనాలు, రవాణాశాఖ, కొప్పుల ఈశ్వర్‌కు సంక్షేమశాఖ, జగదీష్‌రెడ్డికి విద్యాశాఖ, మల్లారెడ్డికి కార్మిక శాఖ, నిరంజన్‌రెడ్డికి వ్యవసాయశాఖ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు పశుసంవర్థక శాఖ, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పంచాయతీరాజ్‌శాఖ, ఇంద్రకరణ్‌రెడ్డికి న్యాయ, అటవీ, దేవాదాయశాఖ, శ్రీనివాస్‌గౌడ్‌కు ఎక్సైజ్‌, క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజంశాఖ