'కేజీఎఫ్‌ 2'లో సంజయ్‌దత్‌.. ఫస్ట్‌ లుక్‌ ఇదే..

 'కేజీఎఫ్‌ 2'లో సంజయ్‌దత్‌.. ఫస్ట్‌ లుక్‌ ఇదే..

కన్నడంలో యష్‌ హీరోగా తెరకెక్కని 'కేజీఎఫ్‌' దేశవ్యాప్తంగా  రికార్డుల మోత మోగించింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా 'కేజీఎఫ్‌ చాప్టర్‌ 2' భారీ క్యాస్టింగ్‌తో రూపొందుతోంది. బాలీవుడ్ టాప్ హీరోలు సైతం ఈ సినిమాలో నటిస్తుండడంతో సూపర్‌  హైప్ క్రియేట్ అయ్యింది. కేజీఎఫ్‌లో మెయిన్ విలన్ బ్రదర్ పాత్రలో అధీరా అనే పాత్రను చూపించినా క్యారెక్టర్ చేసిం నటుడెవరో రివీల్ చేయలేదు. 'కేజీఎఫ్‌ చాప్టర్‌ 2'లో అధీరాదే కీలక పాత్ర అని తెలిసింది. ఆ పాత్ర చేసింది మరెవరో కాదు. బాలీవుడ్‌ బడా హీరో సంజయ్‌దత్‌. ఇవాళ ఆయన బర్త్‌డే సందర్భంగా సినిమాలోని ఆయన లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. తలపాగా చుట్టుకుని కళ్లు మాత్రమే కనిపించేలా తీర్చిదిద్దిన ఈ లుక్‌ విడుదలైన వెంటనే వైరల్‌గా మారింది. హోంబళే ఫిలింస్‌, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న 'కేజీఎఫ్‌ చాప్టర్‌ 2'కు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు.