కేజీఎఫ్ -2 ఎంతవరకు వచ్చిందంటే !

కేజీఎఫ్ -2 ఎంతవరకు వచ్చిందంటే !

కన్నడ హీరో యాష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన 'కేజీఎఫ్' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన సంగతే.  కన్నడలో పాటు తెలుగు, హిందీ, తమిళంలో భారీ వసూళ్లను సాధించిందీ చిత్రం.  ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా 'కేజీఎఫ్ 2'ను తెరకెక్కిస్తున్నారు.  ప్రస్తుతం బెంగుళూరులో షూట్ జరుగుతోంది.  అనంతరం మైసూర్, రామోజీ ఫిల్మ్ సిటీ, బళ్లారి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుంది.  దీంతో 90 శాతం షూటింగ్ ముగుస్తుందట.  పలువురు బాలీవుడ్ తారలు సైతం నటిస్తున్న ఈ భాగంలో వరల్డ్ మాఫియాను తారా స్థాయిలో చూపిస్తూ భారీ యాక్షన్ కంటెంట్ ప్రేక్షకులకి అందిస్తామని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెబుతున్నాడు.