ఆర్ఆర్ఆర్ తో పోటీ పడుతున్న కేజీఎఫ్ 2

ఆర్ఆర్ఆర్ తో పోటీ పడుతున్న కేజీఎఫ్ 2

గతేడాది రిలీజైన కేజీఎఫ్ సినిమా ఎలాంటి హిట్ సాధించిందో చెప్పక్కర్లేదు.  కన్నడంలోనే భారీ బడ్జెట్ తో తెరెక్కిన ఈ సినిమా రూ.200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.  ఈ సినిమాకు కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 ను తీస్తామని అప్పుడే ప్రకటించారు.  అనుకున్నట్టుగానే చాప్టర్ 2 కు సంబంధించిన షూట్ ఈరోజు ప్రారంభమైంది.  

చాప్టర్ ను పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దుతున్నారు.  ఇందులో బాలీవుడ్ హీరో సంజయ్ దత్, రవీనాటాండన్ లు నటిస్తున్నారు.  కైకాల సత్యన్నారాయణ కుమారుడు ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  దాదాపు రూ.200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారట.  అక్టోబర్ వరకు షూటింగ్ కంప్లీట్ చేసి.. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఆర్ ఆర్ఆర్ సినిమా కూడా రిలీజ్ కాబోతున్నది. ఈ రెండు సినిమాల మధ్య భారీ పోటీ ఏర్పడుతుందా.. చూద్దాం.