ఆసక్తి పెంచుతున్న కేజీఎఫ్ స్టార్ లుక్

ఆసక్తి పెంచుతున్న కేజీఎఫ్ స్టార్ లుక్

కేజీఎఫ్ ఎలాంటి హిట్ సాధించిందో చెప్పక్కర్లేదు.  సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమా భారీ హిట్ కొట్టింది.  కన్నడలో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్రకెక్కింది.  ఇందులో హీరో యాష్ తన కల్ట్ అండ్ మాస్ లుక్ తో ఆకట్టుకున్నాడు.  దీనికి కొనసాగింపుగా కేజీఎఫ్ 2 సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  ఆడిషన్స్ వర్క్స్ కూడా పూర్తయ్యాయి.  ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నది.  

ఇదిలా ఉంటె, యాష్ తన కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  ఈ ఫోటో మాములుగా లేదు.  పొడవైన జుట్టు, గడ్డంతో ఆకట్టుకునే లుక్ తో స్టైలిష్ గా కొత్తగా ఉన్నాడు. బహుశా చాప్టర్ 2 సినిమా కోసం ఇలా కొత్తగా తయారయ్యాడేమో.  చాప్టర్ 1 కంటే చాప్టర్ 2 ను మరింత స్టైలిష్ గా, భారీగా తెరకెక్కించబోతున్నారట.