రివ్యూ: కెజిఎఫ్

రివ్యూ: కెజిఎఫ్

న‌టీన‌టులు: యాష్, శ్రీనిధి శెట్టి, అచ్యుత్ కుమార్ 

సంగీతం : రవి బసృర్ 

ఫోటోగ్రఫీ : భువన్ గౌడ 

నిర్మాత : విజయ్ కిరగందురు 

దర్శకత్వం :  ప్రశాంత్ నీల్ 

కన్నడ హీరో యాష్ హీరోగా రూపొందిన చిత్రం 'కేజిఎఫ్'.  హెవీ యాక్షన్ కలిగిన ట్రైలర్లతో, భారీ ప్రమోషన్లష తీవ్ర ఆసక్తిని రేపిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది.   మరి ట్రైలర్లలో ఉన్న దమ్ము సినిమాలో ఉందో లేదో ఇప్పుడు చూద్దాం.. 

కథ 

ధనవంతుడవ్వాలనే కోరికతో సొనాట ఊరిని వదిలేసి ముంబై వెళ్ళిపోతాడు రాకీ (యాష్).  అక్కడే నేర ప్రపంచంలోకి ప్రవేశించి ఒక్కో మెట్టూ ఎదుగుతూ పెద్ద స్థాయికి చేరుకుంటాడు.  అప్పుడే అతని దగ్గరకి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో ఉండే ఒక పెద్ద వ్యక్తిని చంపడానికి డీల్ వస్తుంది.  ఆ డీల్ కుదుర్చుకున్న రాఖీ కెజిఎఫ్ వెళతాడు.  రాఖీ చంపాలనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు, అసలు రాఖీకి ఆ డీల్ ఎవరిచ్చారు, కెజిఎఫ్ లో రాఖీ ఏం చేశాడు అనేదే సినిమా.    

విశ్లేషణ : 

ముందు నుండి అనుకున్నట్టే సినిమాకి హీరో యాష్  పెద్ద ఫ్లస్.  అతని మాస్ మేనరిజమ్స్, నటనలో కనబర్చిన హార్డ్ వర్క్ చాలా బాగుంది.  అతని ఎలివేషన్ కోసం దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు, యాక్షన్ కొరియోగ్రఫర్స్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకి కనువింది చేస్తాయి.  ప్రధానంగా ద్వితీయార్ధంలో సీన్స్ చాలా బాగున్నాయి.  అవి యాక్షన్ ప్రేక్షకులకి ఒక పెద్ద ట్రీట్  అనేలా ఉన్నాయి.  ఇక తమన్నా స్పెషల్ సాంగ్ సినిమాకి మరొక బోనస్ అయింది. 

 ఇంతవరకు బాగానే ఉన్నా నెమ్మదిగా నడిచే కథనం నీరసాన్ని తెప్పిస్తుంది.   హీరోకి ఇచ్చే భారీ బిల్డప్ చూసి అసలు కథేమిటి అనే దానిపై ఉత్కంఠ కలుగుతుంది.  కానీ దర్శకుడు మాత్రం అసలు కథను రివీల్ చేయడానికి చాలా సమయం తీసుకోవడం దెబ్బకొట్టింది.  దాంతో స్క్రీన్ ప్లే గ్రిప్పింగా సాగలేదు.  అలాగే కథలోని చాలా పాత్రలకి సరైన జస్టిఫికేషన్ ఉండదు.   

 

నటీనటుల పనితీరు : 

పైన చెప్పుకున్నట్టు హీరో యాష్ రాఖీ పాత్రలో చాలా బాగా నటించాడు.  మాస్ మేనరిజమ్స్ తో ఆకట్టుకుంటూ యాక్షన్ సన్నివేశాల్లో సైతం అదరగొట్టాడు.  హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాత్ర పరిధిమేర అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది.  మిగిలిన తారాగణం పర్వాలేదనిపించారు. 

సాంకేతిక వర్గం పనితీరు : 

దర్శకుడు ప్రశాంత్ సినిమాకు మంచి బ్యాక్ డ్రాప్ ఎంచుకుని, హీరో పాత్రను గొప్పగా డిజైన్ చేసుకున్నా కథనంలో వేగం, కథలో ఆసక్తి, పాత్రలకు సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయాడు.  నిర్మాతలు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడంతో నిర్మాణం విలువలు గొప్పగా ఉన్నాయి.  భువన్ గౌడ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.  రవి బసృర్ సంగీతం మెప్పించింది.  ఎడిటింగ్ పర్వాలేదు. 

పాజిటివ్ పాయింట్స్ : 

యాష్ నటన

యాక్షన్ ఎపిసోడ్స్ 

మంచి విజువల్స్ 

నెగెటివ్ పాయింట్స్ : 

నెమ్మదిగా సాగిన కథనం 

పాత్రలకు సరైన జస్టిఫికేషన్ లేకపోవడం 

చివరిగా : మాస్ కంటెంట్.. స్లో నరేషన్