సరికొత్త రికార్డులు చేసిన కేజీఎఫ్2 టీజర్..

సరికొత్త రికార్డులు చేసిన కేజీఎఫ్2 టీజర్..

సినిమా లీక్ అయిందంటే ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ చాలా బాధ కలుగుతుంది. అయితే ఒక్కోసారి చెడు కూడా మంచికే అంటారు. దీనిని కేజీఎఫ్2 టీజర్ నిజం చేస్తుంది. అవునండీ.. వేజీఎఫ్2 హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా జనవరీ8న కేజీఎఫ్2 టీజర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ దానికి ఒక రోజు ముందే సినిమా టీజర్ లీక్ అయింది. దాంతో ఏం చేయాలో అర్థం కాక చిత్ర యూనిట్ వెంటనే అధికారికంగా టీజర్ రిలీజ్ చేసింది. అయితే ఈ టీజర్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులను కొల్లగొట్టింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిన విషయమే. అయితే కేజీఎఫ్ మొదటి భాగం తలదన్నేలా రెండో భాగాన్ని సిద్దం చేశారు. దీని ప్రమోషన్స్ కూడా అదేస్థాయిలో చేశారు. యష్ బర్త్ డే సర్‌ప్రైజ్‌గా ప్లాన్ చేసిన టీజర్‌ను లీకుల వీరులు లీక్ చేసేశారు. అయితేనేం ఈ టీజర్ ఇప్పటికే దాదాపు ఐదు మిలియన్ల లైక్‌లు సంపాదించి వరల్డ్ రికార్డ్ సాధించింది. అదే స్థాయిలో వ్యూస్ కూడా వచ్చాయి. భారత హీరోలెవరి సినిమా టీజర్ సాధించని రేంజ్‌లో కేజీఎఫ్2 టీజర్‌కు వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ టీజర్‌కు 90మిలియన్లపైగా వ్యూస్ వచ్చాయి. ఇక మునుముందు ఎంకెన్ని రికార్డులు తన సొంతం చేసుకుంటుందో చూడాలి.