జనవరీ 8న రాకీభాయ్ టీజర్ వస్తుందా..?

జనవరీ 8న రాకీభాయ్ టీజర్ వస్తుందా..?

దేశంలోని సినీ ప్రేమికుల కళ్లన్నీ రానున్న పాన్ ఇండియా సినిమాల వైపే చూస్తున్నాయి. విలక్షణ కథాంశాంలతో అభిమానులను కలవరపెడుతున్నాయి. అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ సినిమాల్లో కేజీఎఫ్2 కూడా ఒకటి. ఈ సినిమా కోలార్ గోల్డ ఫీల్డ్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ సినిమా మొదటి భాగం ఊహించనంతగా హిట్ కావడంతో రెండో చాప్టర్‌ ప్లాన్ చేశారు. కేజీఎఫ్2 తన మొదటి భాగాన్ని మించిన యాక్షన్ సీన్స్‌తో అద్భుతంగా ఉండనుందని అందరూ చెబుతున్న మాట. కేజీఎఫ్ ఒక్క సినిమాతో కన్నడ హీరో యష్ లైఫ్ టర్న్ అయింది. పాన్ ఇండియా హీరోగా మారాడు. ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్2 పోస్టర్ రికార్డులను తిరగరాస్తుంది. అంతేకాకుండా ఇటీవల ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేసి మళ్లీ అభిమానుల మతి పోగొట్టారు. దీంతో దేశంలోని కేజీఎఫ్ అభిమానులు అతి త్వరగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. ఈ ట్రైలర్‌ను కేజీఎఫ్ మేకర్స్ జనవరీ 8న యష్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేస్తారేమో అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సినిమా వాతావరణం కూడా అదేవిధంగా ఉంది. జనవరీ 8న అన్ని భాషల్లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుందని, దాంతో అభిమానులు ఫుల్ ఖుషీ ఫీలవుతారు. ఒక్క భాషలో విడుదల చేస్తే ఇతర భాషల అభిమానులు నిరాశకు గురవుతారు. మరి ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.