దానం అంటేనే.... 

దానం అంటేనే.... 

కాంగ్రెస్ నేత దానం నాగేందర్ అంటేనే దందాలు, దౌర్జన్యాలు, దళారి అర్థం అని ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్తి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దానం నాగేందర్ లాగా నాకు చిల్లర రాజకీయం చేయడం రాదని తెలిపారు. భూ కబ్జాలు,దందాలు చేసే వాడిని  కాదని వెల్లడించారు. ఒక డ్రైవరుగా ఉండి, దందాలు చేసి రాజకీయాల్లోకి వచ్చి వేలకోట్లు సంపాదించాడని శ్రవణ్ విమర్శించారు. దానం నాగేందర్ కు పీజేఆర్ పేరు ఉచ్ఛరించే అర్హత కూడా లేదన్నారు. పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి పీజేఆర్ అని శ్రవణ్ పేర్కొన్నారు. దానం నాగేందర్ 100కోట్లు ఖర్చు పెట్టినా ఖైరతాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని దాసోజు వెల్లడించారు.