ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం తయారీకి అంకురార్పణ

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం తయారీకి అంకురార్పణ

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం తయారీకి ఇవాళ సాయంత్రం మండపం వద్ద అంకురార్పణ(కర్రపూజ) జరుగనున్నది. ఈ సందర్భంగా 20 అడుగుల ఎత్తయిన కర్రకు పూజ నిర్వహిస్తారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి.విజయారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి హాజరవుతున్నారని గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగారి సుదర్శన్ తెలిపారు.