ఈసారి 'ద్వాదశాదిత్య'గా ఖైరతాబాద్ గణేషుడు

ఈసారి 'ద్వాదశాదిత్య'గా ఖైరతాబాద్ గణేషుడు

దేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన వినాయకుడిగా పేరొందిన ఖైరతాబాద్‌ మహా గణపతి ఈసారి 'ద్వాదశాదిత్య మహా గణపతి'గా కొలువుదీరనున్నాడు. మొత్తం 12 తలలు, 24 చేతులు, ఆరు సర్పాలు, సప్తాశ్వాలతో కూడిన సూర్య రథంపై గణనాథుడు కొలువుతీరిన నమూనాను గణేష్‌ ఉత్సవ కమిటీ రూపొందించింది. ఈ విగ్రహం 61 అడుగుల ఎత్తు ఉండగా.. కుడి వైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి.. ఎడమ వైపున బ్రహ్మా, విష్ణు, మహేశ సమేత దుర్గా దేవి ఉండనున్నారు. విగ్రహ తయారీ కోసం వివిధ రాష్ట్రాల నుంచి 150మంది కళాకారులు రాత్రుంబవళ్లు శ్రమించినట్లు ముఖ్య శిల్పాకళాకారుడు సి. రాజేంద్రన్ తెలిపారు.