నేను చెప్పే చేదు నిజాలు కొందరికి నచ్చవు..!

నేను చెప్పే చేదు నిజాలు కొందరికి నచ్చవు..!

నేను చెప్పే చేదు నిజాలు కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలకు నచ్చక పోవచ్చు.. కానీ, నేతలు మేల్కొంటేనే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఖమ్మం పార్లమెంట్ లోక్‌సభ అభ్యర్థి రేణుకాచౌదరి... ఖమ్మంలో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపిన ఆమె.. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేందుకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు బతికే ఉన్నాయని ప్రజలు నిరూపించారు.. నాకు మద్దతుగా నిలిచిన 4 లక్షల మంది ఓటర్లకు కృతజ్ఞతలు అని తెలిపారు రేణుకాచౌదరి. లోక్‌సభ స్థానంలో ఎమ్మెల్యేలు లేకున్నా కార్యకర్తలు టీఆర్ఎస్‌పై పోరాటం చేశారని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ ఓటమికి నాయకత్వం బాధ్యత వహించాలన్న రేణుకా... మరోవైపు తోటి మహిళగా నిజామాబాద్‌లో కవిత ఓడిపోవడం బాధాకరమన్నారు. ఇక కేంద్రంలో కేసీఆర్ అవసరం బీజేపీకి లేదని.. నైతికంగా నేను చాలా సంతోషంగా ఉన్నానన్నారు. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు రావడంపై సీఎల్పీ నేత భట్టిని అడగాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆలోచన చేయాల్సిందన్నారు రేణాకాచౌదరి.