టిక్‌టాక్ వీడియో ఎఫెక్ట్‌: 9 మంది ఉద్యోగాలు ఊస్టింగ్..!

టిక్‌టాక్ వీడియో ఎఫెక్ట్‌: 9 మంది ఉద్యోగాలు ఊస్టింగ్..!

టిక్‌టాక్ వచ్చిన తర్వాత అందులోని వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేయడమే కాదు.. నచ్చిన పాట, మెచ్చిన డైలాగ్.. ఇలా ఎంచుకుని మరీ తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ వీడియోలు అప్‌లోడ్ చేసేస్తున్నారు. విద్యార్థులు, గృహినులు, ఉద్యోగులు, నటులు ఇలా తేడా లేకుండా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే, ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో టిక్‌టాక్‌ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆఫీసులో విధులు నిర్వహించాల్సిన సమయంలో.. వివిధ పనులపై వచ్చేవారిని పట్టించుకోకుండా.. కాలపక్షేపం చేస్తూ టిక్‌టాక్ వీడియోలు తీసి వదిలారు. ఈ వ్యవహారం మీడియాకు ఎక్కడంతో ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌ శ్రీనివాసరావు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో విధులు నిర్వర్తించకుండా టిక్‌టాక్‌ చేసిన సిబ్బందిపై వేటు వేశారు. 9 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ఆఫీసులులో విధులు నిర్వహించాల్సిన సమయంలో సరదాగా చేసిన టిక్‌టాక్ వీడియోలు మొత్తానికి కొలువులకే ఎసరు పెట్టాయి.