వరల్డ్‌కప్‌లో నో ఛాన్స్‌: క్రికెటర్‌ వినూత్న నిరసన

వరల్డ్‌కప్‌లో నో ఛాన్స్‌: క్రికెటర్‌ వినూత్న నిరసన

వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లో ఆడటం ఓ గొప్ప అవకాశం. ఎంతో మంది ఆటగాళ్లు తమ కెరీర్‌లో ఒక్క వరల్డ్ కప్‌లోనైనా ఆడాలని తపిస్తుంటారు. ఇటువంటి మెగా టోర్నీలో చేసే ప్రతి పరుగు, ఆడే ప్రతి మ్యాచ్ ఆటగాడికి ప్రత్యేకమే. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడే ఆవకాశం కొంత మందికి  వస్తుంది.. మరికొంత మందికి ఆ అవకాశం దక్కదు.. ఇంకొంతమందికి వచ్చినట్టే వచ్చి చేజారి పోతోంది. అటువంటి అనుభవమే ఎదురైంది పాకిస్తాన్‌ బౌలర్‌ జునైద్‌ ఖాన్‌కు.  ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన తుది జట్టులో తొలుత జునైద్‌కు చోటు దక్కింది. కానీ.. ఆయనతోపాటు మరో ఇద్దరి స్థానల్లో వేరే ఆటగాళ్లను ఎంపిక చేస్తూ షాకిచ్చింది పీసీబీ.

జునైద్ ఖాన్, ఆల్ రౌండర్ ఫహీమ్ అష్రఫ్, ఓపెనర్ అదిబ్ అలీలను పాక్ బోర్డు పక్కన పెట్టి వారి స్థానంలో అసీఫ్ అలీ, వహాబ్ రియాజ్, మహ్మద్ అమీర్‌లకు జట్టులో చోటు కల్పించింది. ఈక్రమంలో జునైద్‌ వినూత్సంగా నిరసన తెలిపాడు. నోటికి బ్లాక్‌ ప్లాస్టర్ అంటించుకుని ఉన్న ఓ ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. 'చెప్పడానికేమీ లేదు. ఎందుకంటే నిజం చేదుగా ఉంటుంది' అని ట్యాగ్‌ చేశాడు. ఈ విషయం తెలియడంతో పీసీబీ సీరియస్‌ అయింది. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన జునైద్‌.. ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు.