ప్రధాని మోడీకి ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోన్‌

ప్రధాని మోడీకి ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోన్‌

ప్రధాని నరేంద్ర మోడీకి పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇవాళ ఫోన్‌ చేశారు. సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోడీకి ఇమ్రాన్‌ ఖాన్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల ప్రజల అభివృద్ధి కోసం రెండు దేశాలు సమిష్ఠిగా కృషి చేయాలన్న అభిలాషను ఇమ్రాన్‌ వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి ఇమ్రాన్‌ ఖాన్‌ ఫోన్‌ చేసిన మాట నిజమేనని భారత విదేశాంత ప్రతినిధి ధృవీకరించారు. పేదరికంపై ఇరు దేశాల కలిసి పోరాటంపై అంశంపై ఇద్దరు నేతలు మాట్లాడినట్లు ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య శాంతి, అభివృద్ధి సాధన కోసం పరస్సర విశ్వాసం నెలకొనేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ముందని భారత ప్రధాని అన్నట్లు పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. తీవ్రవాదం, హింసకు తావులేని వాతావరణం ఏర్పడాల్సి ఉందని ప్రధాని మోడీ అన్నట్లు స్పష్టం చేసింది.