కియా సెల్టోస్: స్మార్ట్ ఫోన్ తో కంట్రోల్ చేయవచ్చు

కియా సెల్టోస్: స్మార్ట్ ఫోన్ తో కంట్రోల్ చేయవచ్చు

చాలా కాలంగా ఎదురుచూస్తున్న దక్షిణ కొరియా వాహనాల తయారీ సంస్థ కియా తయారుచేసిన ఎస్ యువి సెల్టోస్ నుంచి తెర తొలగింది. కంపెనీ ఒక ఈవెంట్ లో దీని అన్ని ఫీచర్ల గురించి వివరించింది. దీనిని భారత రోడ్లను దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. 

ఫ్రంట్ లుక్ విషయానికొస్తే ఇందులో షార్ప్ లుక్ ఉన్న ఎల్ఈడీ ప్రొజెక్టర్ టైగర్ నోస్ హెడ్ లైట్, డీఆర్ఎల్ ఇచ్చారు. ఇందులో మీకు 3డీ ఎఫెక్ట్ ఉన్న మల్టీ లేయర్ టర్న్ ఇండికేటర్, ఐస్ క్యూబ్ ఫాగ్ ల్యాంప్ ఉంది. ముందు నుంచి కారు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెనుక నుంచి హార్డ్ బిట్ ఎఫెక్ట్ తో ఎల్ఈడీ టెయిల్ లైట్ వస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 8 రంగుల్లో లభ్యం కానుంది. వీటిలో 5 డ్యుయల్ టోన్ పెంచ్ స్కీమ్ లో ఉంటాయి. మొత్తంగా ఇది ఒక మంచి లుక్ ఉన్న కారు. దీని వెనుక బంపర్ పై మెటాలిక్ మఫ్లర్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇందులో కాంట్రాస్ట్ రూఫ్ కూడా ఉంది. 

ఈ కారు 2018 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన కియా ఎస్పీ కాన్సెప్ట్ ఆధారంగా తయారైంది. కారుని ఆటో ఎక్స్ పోలో ఎలాగైతే చూపించారో అచ్చం అలాగే చేశారనిపిస్తుంది. కియా ఈ కారును రెండు మెరుగైన డిజైన్ లైన్స్-ట్యాక్ లైన్, జీటీ లైన్ ట్రిమ్ లో అందజేస్తోంది. ఇది ఒక కాంపాక్ట్ కనెక్టెడ్ కారు. దీనిని కియా యువిఓ అని పిలుస్తోంది. కొంత కాలం క్రితం హ్యుండై వెన్యూ సబ్ కాంపాక్ట్ ఎస్ యువిని లాంచ్ చేసింది. కియా సెల్టోస్ ని వెన్యూతో పోలుస్తున్నారు. ఈ కారు ఇగ్నిషన్, ఏసీ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లను మీరు మీ ఫోన్ ద్వారా ఉపయోగించవచ్చు.

కారుతో పాటు యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఫీచర్లు ఇవ్వడం జరిగింది. సెల్టోస్ తో పాటు రెండు వేర్వేరు ట్రిమ్ తో పాటు సెగ్మెంట్ లో మొదటి 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో నావిగేషన్ ఇచ్చారు. కారుని ప్రీమియం చేసేందుకు బోస్ 8 స్పీకర్ సరౌండ్ సౌండ్ అమర్చారు. భారత్ లో కియా సెల్టోస్ ధర రూ.10 లక్షలు(ఎక్స్ షోరూమ్)-రూ16 లక్షలు (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ కాంపాక్ట్ ఎస్ యువి 2019 నాలుగో త్రైమాసికంలో విడుదల చేస్తారు.