హీట్ పెంచుతున్న లస్ట్ సుందరి..!!

హీట్ పెంచుతున్న లస్ట్ సుందరి..!!

తెలుగులో భరత్ అనే నేను వంటి డీసెంట్ సినిమా చేసిన కియారా అద్వానీ... నెట్ ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ అనే అడల్ట్ కామెడీ వెబ్ సీరీస్ చేసింది.  ఈ సీరీస్ లో కియారా చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఎక్స్ ప్రెషన్స్ తో మతి పోగొట్టింది. ఆ తరువాత టాలీవుడ్ లో రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చేసినా లాభం లేకపోయింది.  ఇప్పుడు బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ లో నటిస్తోంది.  టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి ఎలాంటి హిట్ అయిందో చెప్పక్కర్లేదు.  బోల్డ్ అండ్ కల్ట్ స్టోరీగా తెరెక్కిన ఈ సినిమా సంచలనం సృష్టించింది.  

ఒకవైపు సినిమాల్లో హాట్ హాట్ గా నటిస్తూ... మ్యాగజైన్ కవర్ పేజీలకు ఫోజులు ఇస్తోంది ఈ పొడుగు కాళ్ళ సుందరి.  సెలెబ్రిటీ మ్యాగజైన్ ఎఫ్.హెచ్.ఎమ్ అనే మ్యాగజైన్ కు రీసెంట్ గా ఫోజులు ఇచ్చింది.  కియారా తన అందాలతో రెచ్చిపోవడంతో.. మ్యాగజైన్ కు బోలెడంత మైలేజ్ వచ్చింది. కవర్ పేజీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.