జారిందా.. గోవిందా..

జారిందా.. గోవిందా..

మనం నోటితో చెప్పలేని విషయాలను ఫోటో రూపంలో చెప్పొచ్చు.  భావోద్వేగాలను  ఫొటోల్లో చూపించవచ్చు.  అందుకే చాలామంది ఎప్పటికప్పుడు ఫోటోలను  తీసుకొని భద్రపరుచుకుంటుంటారు.  స్టార్స్ ఈ విషయంలో మరింత ముందు ఉంటారు అన్న సంగతి తెలిసిందే.  హీరోయిన్లయితే  చెప్పాల్సిన అవసరం లేదు.  వాళ్ళ ఆల్బమ్ లో వేలాది ఫోటోలు ఉంటాయి.  

ఫోటోలు దిగే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  కొన్నిసార్లు సాహసాలు చేస్తుంటారు.   ఎత్తైన బిల్డింగ్ లలో ఫోటో సెషన్ జరిగే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  టాప్ హీరోయిన్ కియారా అద్వానీ లేటెస్ట్ గా ఫోటో షూట్ చేసింది.  బిల్డింగ్ లో అద్దానికి ఆనుకొని ఫోటో దిగింది.  అక్కడి నుంచి ఏ మాత్రం జారినా ఇంకేమన్నా ఉన్నదా చెప్పండి.  చాలా కష్టం కదా.