అబ్బా.. అది నిజమైతే బాగుణ్ను..!!

అబ్బా.. అది నిజమైతే బాగుణ్ను..!!

ఎంఎస్ ధోని సినిమాతో బెస్ట్ హిట్ అందుకున్న కియారా అద్వానీ.. నెట్ ఫ్లిక్స్ నిర్మించిన లస్ట్ స్టోరీస్ తో మరో రేంజ్ కు వెళ్ళింది.  ఇటు టాలీవుడ్ లో మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో బంపర్ హిట్ అందుకొని ఇప్పుడు రామ్ చరణ్ తో వినయ విధేయ రామ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  ఈ సినిమా తరువాత కియారా ఏ  సినిమా చేస్తుందనే విషయం తెలియదు.  

బాలీవుడ్ నుంచి ఈ అమ్మడికి బంపర్ ఆఫర్ వచ్చిందని, లవ్ ఆజ్ కల్ సినిమా దర్శకుడు ఇంతియాజ్ ఆలీ నుంచి కాల్ వచ్చిందని.. ఆలీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న లవ్ ఆజ్ కల్ సినిమా సీక్వెల్ లో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని, అందులో నటించేందుకు కియారా కూడా ఓకే చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి.  ఈ వార్తలపై కియారా చాలా స్వీట్ గా స్పందించింది.  ఇంతియాజ్ తనను సంప్రదించలేదని.. తాను ఏ సినిమాకు సైన్ చేయలేదని చెప్పింది.  సైన్ చేసినట్టు చెప్తున్న వార్తలు నిజమైతే బాగుంటుందని మనసులో మాటను బయటపెట్టింది కియారా.