స్టార్ హీరోలు మాత్రమే అంటున్న మహేష్ హీరోయిన్ !

స్టార్ హీరోలు మాత్రమే అంటున్న మహేష్ హీరోయిన్  !

మలయాళం, కన్నడ హీరోయిన్లతో పాటు తెలుగు పరిశ్రమకు ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్ల తాకిడి కూడా ఎక్కువైంది.  మహేష్ యొక్క 'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమై ఆరంభంలోనే బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కైరా అద్వానీ కెరియర్ ను భారీగానే ప్లాన్ చేసుకుంటోంది. 

మహేష్ తరవాత రామ్ చరణ్ తేజ్ తో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఈమె తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడ ఒక చిత్రాన్ని చేయనున్నట్లు సమాచారం.  అట్లీ, విజయ్ లు కలిసి చేయనున్న ఈ చిత్రం ఇంకొద్ది నెలల్లో మొదలుకానుంది.  ఇలా కైరా తన డేట్లు ఫర్ స్టార్ హీరోస్ సినిమాస్ ఓన్లీ అంటోంది తప్ప చిన్న హీరోలు, చిన్న సినిమాల జోలికి పోవడంలేదు.