ఎన్‌టీఆర్30లో హీరోయిన్ ఆమేనంట..?

ఎన్‌టీఆర్30లో హీరోయిన్ ఆమేనంట..?

యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ప్రస్తుతం ఎన్‌టీఆర్ జక్కన్న దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నరు. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఎన్‌టీఆర్ ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ విషయంలో మరో ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో ఎన్‌టీఆర్‌తో రొమాన్స్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఈ అమ్మడు ఇప్పటికే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ సరసన ‘భరత్ అనే నేను’ సినిమాలో కనిపించారు. అంతేకాకుండా రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమాలోనూ నటించారు. ఆ తరువాత కియారా మళ్ళీ తెలుగులో చేయలేదు. ఇప్పుడు ఎన్‌టీఆర్ సినిమాతో మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఈ విషయంపై క్లారిటీ వస్తుందేమో వేచి చూడాలి.