ఆ క్రియేటివిటీని కూడా కాపీ కొట్టారా.. ?

ఆ క్రియేటివిటీని కూడా కాపీ కొట్టారా.. ?

మహేష్ నటించిన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షులకు పరిచయమైనా భామ కియార అద్వానీ, ఈ సినిమాతరువాత  రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో నటించింది. ఈ సినిమా నిరాశ పరచడంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ షూట్ లో రత్తాన్ని తన క్రియేటివిటీని మొత్తం ఉపయోగించి కియారను ఫోటోలు తీసాడు.  కేవలం పచ్చని ఆకును అడ్డుగా పెట్టుకొని కియారా తన నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఫోటోని తీశారు. ఈ ఫోటో కాస్తా వైరల్ అయ్యింది. అయితే ఈ ఫోటోషూట్ కాపీ చేసారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంట్రనేష్నల్ ఫోటోగ్రాఫర్ మేరీ బార్ష్ ఫోటో షూట్ తో దీనికి పోలికలు ఉన్నాయి. ఈ ఫోటో షూట్ లో కూడా ఇలానే ఒక మోడల్ ఆకును అడ్డుగా పెట్టుకొని ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. దాంతో డబూ రత్నానీ ఓ రేంజులో ఆడుకుంటున్నారు నెటిజన్లు. స్టోరీ, పోస్టర్లు, పాటల తో పాటు చివరకు క్రియేటివిటీ నికూడా కాపీ కొడుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.