ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న కన్నడ సూపర్ స్టార్... 

ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న కన్నడ సూపర్ స్టార్... 

ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తోంది. అయితే ఈ కరోనా సమయంలో చాలా మంది సెలబ్రెటీలు తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే కేంద్ర ప్రభుత్వానికి సహాయం అందించారు. కానీ ఈ కరోనా కంటే ముందే కొంతమంది హీరోలు సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూనే వచ్చారు. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయాడు కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్. ఈయన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాల్లో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 4 ప్రభుత్వ స్కూళ్లను సుదీప్ దత్తత తీసుకున్నాడు. అక్కడ చదువుకునే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని స్కాలర్ షిప్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాడు. అలాగే పెద్ద పెద్ద  ప్రైవేట్ స్కూళ్ల మాదిరిగా వారికి డిజిటల్ క్లాస్ రూంలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే  సుదీప్ కు కన్నడతోపాటు తెలుగులో కూడా మంచి  ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరక్కేకించిన 'ఈగ' సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది.