సల్మాన్ సినిమాలో ఈగ విలన్

సల్మాన్ సినిమాలో ఈగ విలన్

సల్మాన్ ఖాన్ భారత్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమా ప్రకటించాడు.  అదే దబాంగ్ 3.  దబాంగ్ సీరీస్ లో మూడో సినిమా.  ఫస్ట్ సినిమా దబాంగ్ బాలీవుడ్ లో సంచలన విజయం సొంతం చేసుకున్నది.  ఆ సినిమాకు చేసిన సీక్వెల్ పెద్దగా ఆడలేదు.  అయినప్పటికీ సల్మాన్ సీరీస్ లో మూడో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు.  

ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతున్నది.  ఇందులో సౌత్ హీరో కిచ్చ సుదీప్ కూడా నటిస్తున్నాడట. ఇతర భాషల్లో సుదీప్ ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తున్నాడు.  ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా దబాంగ్ 3 లో మరో హీరో రోల్ చేసేందుకు సుదీప్ కు అవకాశం ఇచ్చాడట సల్మాన్.