దుర్గగుడిలో కిడ్నాప్‌ కలకలం

దుర్గగుడిలో కిడ్నాప్‌ కలకలం

విజయవాడ దుర్గగుడిలో చిన్నారి అదృశ్యమవడం సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన పైడి రాజు, శ్రీదేవిల ఐదేళ్ల కుమార్తె నవ్యశ్రీ ఇవాళ  ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆలయంలో అదృశ్యమైంది. నవ్యశ్రీను ఓ మహిళ తీసుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యయి. వీటి ఆధారంగా చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆలయంలోనే వేరు వాళ్లు పాపను తీసుకెళ్లినట్టు గుర్తించారు. మొత్తం 8 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. 

నరసరావుపేటలో ఆచూకీ లభ్యం..
నవ్యశ్రీ కిడ్నాప్‌ కేసును పోలీసులు 12గంటల్లోనే పోలీసులు ఛేదించారు. నరసరావుపేటలో పాప ఉన్నట్టు గుర్తించి తమ ఆదీనంలోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు రూరల్‌ ఎస్పీ కార్యాలయానికి తరలించారు. చిన్నారిని తీసుకెళ్లిన దంపతులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.