డిప్యూటీ కలెక్టర్ గా కిడారి సందీప్ ఛార్జ్

డిప్యూటీ కలెక్టర్ గా కిడారి సందీప్ ఛార్జ్

అమరావతిలో డిప్యూటీ కలెక్టర్ గా కిడారి సందీప్ కుమార్ నియమితులయ్యానారు. సీసీఎల్ఏ కార్యాలయంలో సాయంత్రం 4గంటలకు సందీప్ ఛార్జ్ తీసుకున్నారు. మావోయిస్టుల చేతిలో బలైన దివంగత అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు  రెండో కుమారుడు సందీప్. ఆయన మరణానంతరం  గ్రూప్ 1 ఆఫీసర్ గా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. పెద్ద కుమారుడు శ్రవణ్ కుమార్ చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడుగా కొనసాగుతున్నారు.