మంత్రి పదవికి రాజీనామాపై కిడారి స్పందన..

మంత్రి పదవికి రాజీనామాపై కిడారి స్పందన..

ఆంధ్రప్రదేశ్‌ వైద్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కిడారి శ్రావణ్‌ కుమార్ తన మంత్రి పదవి రాజీనామా చేశారు... అమరావతిలోని సీఎంవోలో తన రాజీనామా లేఖను సమర్పించిన కిడారి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాజ్యాంగ నిబంధనలకు లోబడి రాజీనామా చేశానని తెలిపారు. మంత్రిగా ఆరు నెలల పదవి కాలంలో మూడు నెలలు ఎన్నికల కోడ్‌కే పోయిందన్న శ్రావణ్‌కుమార్... కానీ, గిరిజనుడిగా నాకు మంత్రి పదవి దక్కడం సంతోషం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నన్ను తన కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారిన తెలిపిన కిడారి.. నా శాఖ ద్వారా గిరిజనుల కోసం ఫుడ్ బాస్కెట్ పథకాన్ని తీసుకురావటం సంతోషంగా ఉందన్నారు. 6 నెలలే పదవిలో ఉండడంపై ఇబ్బంది లేదన్నారు. తమ నేత చంద్రబాబు సూచనల మేరకే రాజీనామా చేశానని.. నాకు రాజకీయ అనుభవం లేకపోయినా.. గిరిజనులపై ఉన్న ప్రేమతో నాకు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు కిడారి.