భారతీయ సంప్రదాయ దుస్తుల్లో విండీస్ క్రికెటర్ ఫామిలీ

భారతీయ సంప్రదాయ దుస్తుల్లో విండీస్ క్రికెటర్ ఫామిలీ

సంస్కృతి, సంప్రదాయాలకు భారత దేశం పుట్టినిల్లు. ప్రపంచంలోని ఎందరో విదేశీయులు ఇక్కడికి వచ్చి మన సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్దులవుతారు. విదేశీయులు కూడా భారత సంప్రదాయ దుస్తులు ధరించి మన కల్చర్ ని గౌరవిస్తారు. ఇందుకు క్రికెటర్లు కూడా మినహాయింపేమీ కాదు. తాజాగా వెస్టిండీస్ క్రికెటర్ కీరణ్ పోలార్డ్ ఫ్యామిలీ భారత సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ముఖ్యంగా పోలార్డ్ సతీమణి, కూతురు ఆకట్టుకున్నారు. ఐపీఎల్, ద్వైపాక్షిక సిరీస్ లకు భారత్ కు వచ్చే పోలార్డ్ భారత సంప్రదాయ దుస్తులకు ముగ్దుడై.. ఇలా కనువిందు చేసారు.