'అందులో కూడా జగన్‌ చరిత్ర సృష్టించారు'

'అందులో కూడా జగన్‌ చరిత్ర సృష్టించారు'

అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పిస్తూ సామాజిక సమతుల్యతో కూడిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్‌ చరిత్ర సృష్టించారని కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ నేత కిల్లి కృపారాణి అన్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ఆమె కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పక్షపాతం, కక్షసాధింపు చర్యలకు జగన్ దూరంగా ఉంటారని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్‌ నెరవేరుస్తున్నారన్న ఆమె..  ఇసుక మాఫియాని అడ్డుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జన్మభూమి మాఫియా వల్లే టీడీపీ అధికారం కోల్పోయిందని కృపారాణి అభిప్రాయపడ్డారు.