కింగ్ ఖాన్ దృష్టి ఇప్పుడు దానిమీదేనా..?

కింగ్ ఖాన్ దృష్టి ఇప్పుడు దానిమీదేనా..?

కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాలు గత కొంతకాలంగా నిరాశ పరుస్తున్నాయి.  ఎన్నో హోప్స్ తో వచ్చిన జీరో సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచింది.  దీంతో ఖాన్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.  ఖాన్ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.  అందుకే ఫర్హాన్ అక్తర్ తో కలిసి డాన్ సిరీస్ లో మూడో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.  అనుకోవడమే కాదు ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాడు.  

ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ తుఫాన్ సినిమా బిజీలో ఉన్నాడు.  ఈ సినిమా పూర్తయ్యాక డాన్ సినిమాపై దృష్టిపెడతాడు.  ఒకవైపు తీస్తూనే.. మరోవైపు డాన్ 3 స్క్రిప్ట్ ను తయారు చేసే పనిలో ఉన్నాడట.  ఈ ఏడాది చివరివరకు స్క్రిప్ట్ పూర్తి చేస్తారని సమాచారం.  ఎలాగో ఈ సమ్మర్ లో ఐపీఎల్ మ్యాచ్ లు ఉన్నాయి.  ఖాన్ ఐపీఎల్ పై దృష్టి పెట్టబోతున్నాడు.  ఈ ఐపీఎల్ పూర్తయ్యాక తిరిగి సినిమా పనిలో పడతారని తెలుస్తోంది.  బాలీవుడ్ లో ఖాన్ మరలా మెరవాలంటే.. హిట్ కొట్టాల్సిందే.