సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలు ఆవిరి.. పంజాబ్ విక్టరీ !
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ ఆశలు ఆవిరయ్యాయి. కీలక మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓటమిపాలైంది వార్నర్ సేన. స్వల్ప టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ దూసుకుపోతోంది. సీజన్ ఆరంభంలో వరుస ఓటములు ఎదురైనప్పటికీ.. ఇప్పుడు పుంజుకుంటోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది. 127 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ను 114కే కుప్పకూల్చింది. 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై 127 రన్స్ టార్గెట్‌ను సన్‌రైజర్స్ ఛేదించలేకపోయింది. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం అందించారు. అబ్దుల్ సమద్ త్వరగానే ఔటైనా.. విజయ్ శంకర్ , మనీశ్‌పాండే నిలకడగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం అందించారు. సునాయసంగా సింగిల్స్ తీస్తుండటంతో వీరిద్దరూ మ్యాచ్‌ను గెలిపిస్తారనే అనుకున్నారు.
అయితే వార్నర్ సేన 14 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు చేజార్చుకుంది. ఆఖరి ఓవర్లో 14 పరుగులను అర్షదీప్ డిఫెండ్ చేశాడు. కేవలం ఒక పరుగే ఇచ్చి ప్రత్యర్థిని ఆలౌట్ చేసేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టులో కేఎల్ రాహుల్, పూరన్ రాణించారు. క్రిస్ గేల్, మన్ దీప్ సింగ్ కూడా సమయోచితంగా రాణించారు. భారీ హిట్టర్ నికోలస్ పూరన్ సైతం షాట్లు ఆడలేకపోయాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)