ఐపీఎల్ 13 సీజన్ లలో 12 మంది కెప్టెన్స్ ... ఆ జట్టు ఏదంటే...?

ఐపీఎల్ 13 సీజన్ లలో 12 మంది కెప్టెన్స్ ... ఆ జట్టు ఏదంటే...?

2008 లో ప్రారంభమైన ఐపీఎల్ 12 సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఐపీఎల్ లో పాల్గొనే 8 జట్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఒకటి. అయితే ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో ఒక్కసారి కూడా పంజాబ్ జట్టు టైటిల్ అందుకోలేదు. కానీ 2014 లో మాత్రం ఫైనల్స్ లో ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది. ఇక ఈ ఐపీఎల్ 13 వ సీజన్ లో ఈ జట్టు సెప్టెంబరు 20న ఢిల్లీ క్యాపిటల్స్ ‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే మొత్తం ఈ 13 సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు 12 మంది న్యాయకత్వం వహించారు. వారెవరంటే....

2008, 2009 : యువరాజ్ సింగ్ 
2010 : కుమార్ సంగక్కర, మహేల జయవర్ధనే 
2011 : ఆడమ్ గిల్‌క్రిస్ట్ 
2012, 2013 : డేవిడ్ హస్సీ 
2014 : జార్జ్ బెయిలీ 
2015 : వీరేందర్ సెహ్వాగ్ 
2016 : డేవిడ్ మిల్లర్, మురళీ విజయ్
2017 : గ్లెన్ మాక్స్వెల్
2018, 2019 : రవిచంద్రన్ అశ్విన్
2020 : కేఎల్ రాహుల్... మరి ఈ ఏడాది ఈ జట్టుకు రాహుల్ ఎలా న్యాయకత్వం వహిస్తాడు అనేది చూడాలి.